భూగోళం మొత్తం ఉపరితల వైశాల్యం 510,065,284చ.కి.మీ. — అందులో 70.8% అనగా 361,126,221 చ.కి.మీ. నీటి భాగం. మిగిలిన 29.2% అనగా 148,939,063 చ.కి.మీ. నేల. ఐ.రా.స. లెక్కలలో పరిగణించిన స్వపరిపాలన గలిగిన అధీన "దేశాలు" కూడా చూపబడ్డాయి. యూరోపియన్ యూనియన్ అనేది వివిధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక "రాజకీయ సమూహం". ఆ ఒప్పందాల కారణంగా ఒక దేశానికి ఉండే లక్షణాలు ఈ సమూహానికి ఉన్నాయి. ఇందులో 27 సభ్య దేశాలున్నాయి. అన్నింటి మొత్తం వైశాల్యం 4,422,773 చ.కి.మీ. ఇది గనుక ఒక దేశమైతే ప్రపంచంలో ఇది ఏడవ పెద్ద దేశం అవుతుంది.